వేసవిలో ఏ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

by Dishanational2 |
వేసవిలో ఏ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : వేసవి వచ్చిందంటే చాలు. చాలా మంది టీ తాగాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. ఇక మన దేశంలో అనేకరకాల టీలు ఉన్నాయి. గ్రీన్ టీ, బ్లాక్ టీ, టీ ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే సమ్మర్‌లో ఏ టీ తాగాలి, ఏ టీతాగితే వేసవిలో శరీరానికి చలువ వుంటుందో ఇప్పుడు చూద్దాం.

బ్లాక్ టీ గురించి అందరికీ తెలిసిందే. అయితే వేసవిలో బ్లాక్ టీ తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట. ఇది డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా కాపడటమే కాకుండా, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుందంట. అలాగే బ్లాక్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.అదే విధంగా బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు, కెఫిన్ అధికంగా ఉండటం వల్ల ఇది మీ జుట్టుకు కూడా మేలు చేస్తుంది. అందువలన వేసవిలో బ్లాక్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదంట.

Next Story

Most Viewed