మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తున్న కలరా..ఇద్దరు మృతి

by Jakkula Mamatha |
మధ్యప్రదేశ్‌లో కలకలం సృష్టిస్తున్న కలరా..ఇద్దరు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: సాధారణంగా కలరా అనేది కలుషితమైన నీటి ద్వారా వ్యాపించే వ్యాధి. కలరా తీవ్రమైన డయేరియా, డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌లో కలరా వ్యాప్తి కలకలం రేపుతోంది. సుమారు 80 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. కలరా బారినపడ్డ ఇద్దరు మరణించారు. భింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫూప్ నగరంలోని 5,6,7 వార్డుల్లో నీరు కలుషితమైంది. దీంతో స్థానిక ప్రజలకు కలరా సోకింది. వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. ఇప్పటికే చాలా మంది కోలుకోగా.. మరో ఆరుగురు మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈ క్రమంలో మురుగునీరు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నివసించే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని, కలుషితమైన నీటిని సేవించవద్దని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed