కరివేపాకు నీటితో ఉబకాయానికి చెక్​

by Sridhar Babu |
కరివేపాకు నీటితో ఉబకాయానికి చెక్​
X

దిశ, వెబ్​డెస్క్​ : కరివేపాకు మాత్రమే కాకుండా కరివేపాకు నుండి వచ్చే నీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కరివేపాకు నీరు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. కరివేపాకు నీటిని కూడా తరుచుగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు నీరు తయారు చేసుకోవడం చాలా సులువు. ఒక పాన్ లో ఒక కప్పు నీటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిలో కరివేపాకు ఆకులను వేయాలి. ఆ నీరు రంగు మారేవరకు బాగా మరిగించాలి. ఆ తర్వాత కరివేపాకు ఆకులను తీసేయాలి. ఇక ఆ నీటిని తాగాలి.

ఈ నీటిని తాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నీటిని తాగడం వలన బరువు తగ్గవచ్చు. ఇక ఊబకాయంతో బాధపడుతున్నవారు, కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇక జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా కరివేపాకు నీటిని తీసుకోవడం మంచిది. దీని వలన గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు లాంటి సమస్యలు దూరం అవుతాయి. కరివేపాకు నీటిని తీసుకోవడం వలన విష మలినాలు కూడా తొలగిపోతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర నిర్వీకరణకు సహాయపడతాయి. ఇక చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు లాంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Next Story

Most Viewed