కడుపులో నులిపురుగులకు ఇలా చెక్ పెట్టండి !

by Disha Web Desk 8 |
కడుపులో నులిపురుగులకు ఇలా చెక్ పెట్టండి !
X

దిశ, ఫీచర్స్ : కడుపులో నులిపురుగులు అనేవి చాలా కామన్. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ సమస్యను ఎదుర్కొంటారు.నులి పురుగులు అనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు ఈ వ్యాధి కారకాన్ని అస్కారియాసిస్ అని పిలుస్తారు.

అయితే ఈ నులిపురుగులు ఆరోగ్యానికి అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ, ఇది ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీని వలన రక్తహీనత, తరచూ ఆకలి దప్పులు, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అందువలన ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వాటిని కడుపులో నుంచి బయటకు పంపించడానికి కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

కడుపులో ఉన్న నులిపురుగులు పోవాలంటే, రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను చెప్పుల కింద వేసుకుని నడవాలంట. దీని రసం చర్మం గుండా రక్తప్రవాహంలోకి వెళ్లి పురుగులను చంపుతుందంట. అలాగే రోజూ మనం తీసుకునే ఆహారంలో పసుపు, అల్లం, ఓము, దాల్చిన చెక్క లాంటివి తప్పనిసరిగా వాడాలి అంటున్నారు వైద్యులు.

ఇక ఈ నులిపురుగుల బాధతో సతమతం అవుతున్నవారు, ఆహారంలో పాలకూర, బొప్పాయి, అవకాడో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.అంతే కాకుండా రోజూ ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం వలన కూడా నులిపురుగులు చనిపోతాయంట.


Next Story

Most Viewed