Waking up tired : ఉదయం నిద్రలేవగానే అలసటగా ఉంటుందా.. కారణం ఏంటో తెలుసా..

by Disha Web Desk 20 |
Waking up tired : ఉదయం నిద్రలేవగానే అలసటగా ఉంటుందా.. కారణం ఏంటో తెలుసా..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎక్కువగా పరిగెత్తినప్పుడో లేదా హార్డ్‌వర్క్‌ చేసినప్పుడు మనం అలసిపోవడం, ఆయాసపడడం సహజం. కానీ కొంత మంది మాత్రం ఉదయం నిద్ర లేచి లేవగానే ఏదో పనిచేసినట్టుగా ఆయాస పడుతారు. నిద్రలేవగానే అలసటగా అనిపించి నీరసంగా ఉంటారు. ఇలా తరచూ జరగడం వ్యాధులకి సంకేతమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎక్కువ రోజుల నుంచి ఇలా జరిగితే కాస్త కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాటితో పాటుగానే మరికొంతమందికి అప్పుడప్పుడూ నిద్రలేవగానే అలసట వస్తుంది. అలా ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బెడ్ రూం వాతావరణం..

పడకగదిలో ఉండే కొన్ని అంశాలు నిద్ర పై ప్రభావాన్ని చూపిస్తాయి. గోడలకి వేసే రంగులు డార్క్ గా ఉంటే అది కాస్త డిస్టప్ గా ఉంటుంది. అందుకే లైట్‌ కలర్స్‌ను వేయాలి. అలాగే బెడ్ రూం లో ఉష్ణోగ్రత ఎక్కువ చలిగా, వేడిగా కాకుండా అనుకూలంగా ఉండాలి. అలాగే పడుకునే సమయంలో ఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోవాలి. అలా చేసినప్పుడే హాయిగా నిద్రపోతారు. నిద్రలేకపోతే మనుషులు అలసటగా ఉంటారు.

సమయానికి నిద్రించకపోవడం..

ఒక్కొక్కరి జీవినవిధానం ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది అర్ధరాత్రిల్లు వరకు నిద్రపోకుండా మెలుకువతో ఉంటారు. మరికొంత మంది సరైన సమయానికి నిద్రపోతారు. అయితే నిద్రించే సమయాలు కూడా వారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయి. సరైన సమయానికి నిద్రించకపోతే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అలాగే బలహీనత, నీరసం వస్తాయి. అందకే తినే సమయాన్ని, నిద్రించే సమయాన్ని తప్పకుండా పాటించాలి.

ఆహారం, పానీయాల అలవాట్లు..

ఆల్కహాల్, కెఫిన్‌ ఎక్కువగా తీసుకోవడం వలన నిద్రకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దాంతో ఉదయం లేవడానికి కూడా ఓపిక లేనంతగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అలాగే ఆల్కహాల్ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. అందుకే ఎవరైనా నిద్ర పోవడానికి 3 గంటల ముందు కెఫిన్‌, ఆల్కహాల్ కు సంబంధించిన పానీయాలని తీసుకోకూడదు.

చాలాసేపు పడుకోవడం..

చాలామంది ఉదయం లేవడానికి బద్దకిస్తూ ఉంటారు. మెలకువ వచ్చినా మంచం మీదే ఉంటారు. అలా చేయడం ద్వారా శరీరం నీరసంగా, బలహీనంగా అనిపిస్తుంది. ఉదయమే నిద్ర లేస్తే శరీరం ఉల్లాసంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి ::

ఒత్తిడిలేని ప్రశాంతమైన జీవితాన్ని కావాలనుకుంటున్నారా..

ఇంట్లో అశాంతి నెలకొందా..! ఆనందంగా జీవించాలి అనుకుంటే ఈ 5 చర్యలు పాటించండి

ఇతర జాతులతో పోలిస్తే పిల్లులకు ఆ విషయంలో 100 రెట్లు అధిక సామర్థ్యం.. సీక్రెట్ కనిపెట్టేసిన శాస్త్రవేత్తలు



Next Story

Most Viewed