10 కోట్ల కార్బెవాక్స్ డోసులు పంపిణీ

by Disha WebDesk |
10 కోట్ల కార్బెవాక్స్ డోసులు పంపిణీ
X

హైదరాబాద్: ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ లిమిటెడ్ (బీఈ) ఇప్పటివరకు 10 కోట్ల కార్బెవాక్స్ వ్యాక్సిన్ డోసులను కేంద్రానికి అందించినట్లు గురువారం సంస్థ వెల్లడించింది. 18 ఏళ్లు పైబడిన వారు ప్రికాషన్ డోసుగా కార్బెవాక్స్‌ను కేంద్రం ఆమోదించిందని సంస్థ పేర్కొంది. 2022 ఆగస్టు 12 (నేడు) నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ టీకా కేంద్రాల్లో కార్బెవాక్స్ అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ధర రూ.400 ఉండనున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టీఐఏజీఐ)కి చెందిన కోవిడ్-19 వర్కింగ్ గ్రూపు ఇటీవల చేసిన సిఫార్సు మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్బెవాక్స్‌కు ఆమోద ముద్ర వేసింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ మొదటి రెండు డోసులు వేసుకున్న వారు బూస్టర్ డోస్‌గా కార్బెవాక్స్‌ను వేసుకోవచ్చు. 12 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వబడుతోంది. ఈ మధ్యనే బూస్టర్ డోస్‌గా తీసుకునేందుకు చేసిన ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు ఇచ్చింది.

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed