బరువు తగ్గాలనుకుంటున్నారా.. మార్నింగ్ ఈ పని చేయండి..

163

దిశ, వెబ్‌డెస్క్ : ఎక్కువ బరువు ఉండాలని ఎవరనుకుంటారు. చాలా మంది ఒక్కసారిగా బరువు పెరిగిపోతారు. ఇక వేయిట్ లాస్ అయ్యేందుకు వారు పడే కష్టాలు అంతా ఇంత కాదు. ఎందుకంటే శరీరంలో అధిక బరువు కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన అధిక బరువును తగ్గించుకోవడానికి చాలామంది ప్రస్తుతం జిమ్​లు, ఫిట్​నెస్​ సెంటర్లు చుట్టూ తిరుగుతున్నారు. కానీ ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రయోగాలు చేస్తే ఈజీగా బరువు తగ్గవచ్చు కానీ ప్రస్తుతం అలాంటివి ఎవరూ చేయట్లే. అయితే త్వరగా బరువు తగ్గాలి అనుకునేవారికోసం కొన్ని చిట్కాలు చూద్దాం. ఇక ఉదయంపూట ఈ చిట్కాలు ఫాలో అయితే త్వరగా సన్నబడి అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తారు.

  • ఉదయం లేవగానే వ్యాయామం చేయాలి. ఎందకంటే వ్యాయామం చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఉదయం పూట తప్పని సరిగా టిఫిన్ చేయాలి ఒక వేళ టిఫిన్ మానేసినట్లైతే ఈజీగా బరువు పెరుగుతారు. అందువలన టిఫిన్ తప్పని సరిగా చేయాలి.

  • ఉదయం పూట అల్పాహారం కింద ఇడ్లీ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గడానికి ఉపయోగ పడుతోంది.

  • ఉదయాన్నే లేచి వెల్లుల్లిని ఖాళీ కడుపున తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఒక గ్లాసు నిమ్మరసం తీసుకుంటే త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

  • జంక్ ఫుడ్ తినొద్దు. ఆకలిగా ఉన్నప్పుడు ఓ యాపిల్ తింటే మించిది.

  • నీళ్లు ఎక్కవ తీసుకోవడాని ప్రయత్నం చేయాలి