ఒమిక్రాన్ బారిన పడకుండా ఉండాలా.. ఈ హెల్త్ టిప్స్ ఫాలో అవ్వండి

521

దిశ, వెబ్‌డెస్క్ : ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఇక ఈ కరోనా కాలంలో మనం ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. ప్రస్తుతం ఒమిక్రాన్ విజృంభన కొనసాగుతోంది. చాలా మంది ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. అయితే ఒమిక్రాన్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడాని మనం తీసుకునే ఆహారమే ముఖ్యం అయితే మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడితే ఒమిక్రాన్ వచ్చినా కానీ తట్టుకోగలుగుతం. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ బారిన పడకుండా ఉండడానికి రోగనిరోధక శక్తి ఎలా పెంచుకోవాలో చూద్దాం..

ప్రశాంతత మనిషికి దేవుడిచ్చిన వరం అంటారు పెద్దలు. ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటం వలన కూడా ఎలాంటి వైరస్ దరిచేరినా ఈజీగా దాన్ని తట్టుకోగలుగుతాం అంటున్నారు వైద్యులు. అంతే కాకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లని చేయడం వల్ల ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. అలాగే విటమి డీ కూడా మనశరీరానికి చాలా అవసరం. కరోనా, ఒమిక్రాన్ లాంటి సమయాల్లో తప్పకుండా విటమిన్ డీ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఈ విటమిన్ డీ వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే ఆరోగ్యంగా ఉంటాం. అంతే కాకుండా సమయానికి టిఫిన్, ఆకుకూరలు, పండ్లు  తినడం కూడా శరీరానికి మంచిది. ప్రతి రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలి ఇలా ప్రతి రోజు సరైన ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతోంది. మంచి నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. చక్కగా ఎక్కువసేపు నిద్రపోతే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలానే నిద్రలేమి సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ సేపు నిద్రపోండి.