కరోనా కట్టడికి కేంద్రం నెక్స్ట్ ప్లాన్!

by  |
కరోనా కట్టడికి కేంద్రం నెక్స్ట్ ప్లాన్!
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కట్టడికి కేంద్రం పలు చర్యలు సహా లాక్ డౌన్ అమలు చేస్తున్నది. అయితే లాక్ డౌన్ కాలంలోనూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న చోట్లను హాట్ స్పాట్లుగా గుర్తించి కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. అయితే.. కేసులు భారీగా పెరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై ఇప్పటికే తలమునకలైంది. ఈ విషయమై హెల్త్ మినిస్ట్రీ ఓ వ్యూహాన్నీ రూపొందించింది.

బఫర్ జోన్ల గుర్తింపు.. నెలరోజులు సీల్..!

కేసులు అధికంగా నమోదు అవుతున్న చోట్లను బఫర్ జోన్ లు ( సుమారు 5 కిలోమీటర్ల పరిధి!) గా గుర్తించి వాటిని పూర్తిగా సీల్ చేసే వ్యూహాన్ని హెల్త్ మినిస్ట్రీ రూపొందించింది. వెబ్సైట్ లో ఆ డాక్యుమెంట్ ను పొందుపరిచింది. 20 పేజీలున్న ఆ డాక్యుమెంట్ ప్రకారం… బఫర్ జోన్ నుంచి బయటకు.. బయటినుంచి లోనకు రాకపోకలనీ సర్కారు పూర్తిగా నిలిపివేస్తుంది. ఆ జోన్లోని కరోనా బాధితులు సహా అనుమానితులనందరినీ ఆస్పత్రులకు తరలిస్తుంది. పేషెంట్లకు రెండు సార్లు పరీక్ష నిర్వహించి రెండుసార్లూ నెగటివ్ వస్తేనే ఆస్పత్రి నుంచి బయటకు పంపిస్తుంది. కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించినవారిని స్టేడియంలలో క్వారంటైన్ చేస్తుంది. మధ్యస్థంగా లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి.. సీరియస్ గా కనిపిస్తే అడ్వాన్స్ హాస్పిటల్ కు తరలిస్తుంది. గుర్తించిన జోన్లలో స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులను బంద్ చేస్తుంది. చివరి కేసు తర్వాత నెల రోజుల పాటు కొత్తగా ఎటువంటి కేసు వెలుగుచూడకుంటేనే ఆ జోన్ లో ఆంక్షలు సడలిస్తుంది.

ఒక్కో ప్రాంతానికి ఒక్కో వ్యూహం..

దేశవ్యాప్తంగా ఒకే వేగంతో ఒకే తీరుగా కరోనా విస్తరించడం లేదు. ఇతర దేశాల్లో చూసినా ఆ తీరు కనబడదు. కాబట్టి భౌగోళిక పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాలకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని హెల్త్ మినిస్ట్రీ అభిప్రాయపడింది. కొవిడ్ 19ను కట్టడి చేయగలిగిన చైనా కూడా దేశవ్యాప్త లాక్ డౌన్ అమలు చేయలేదు. వైరస్ విజృంభించిన వుహాన్ లోనే గట్టి నిర్బంధాన్ని అమలు చేసింది.

Tags: Coronavirus, strategy, centre, health ministry, contain, buffer zone



Next Story

Most Viewed