వివేక్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్..

by  |
వివేక్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్..
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ కమెడియన్ వివేక్ కు ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని సిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఉదయం 11 గంటలకు ఆసుపత్రికి స్పృహ లేని స్థితిలో వచ్చినట్టు తెలిపిన వైద్యులు, ప్రస్తుతం వివేక్‌ను ఐసీయూలో ఎక్మో పై ఉంచి యాంజియోగ్రామ్‌తో పాటు యాంజియో ప్లాస్ట్ చికిత్స అందించినట్టు వెల్లడించారు.

అంతేకాకుండా 24 గంటలు గడిస్తేగాని ఏం చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. వివేక్ కు గుండెపోటు రావడంతో ఆయన అభిమానులతో కోలివుడ్ ప్రముఖులు సైతం ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. వివేక్ కు 2009లోనే కేంద్రం ప‌ద్మ‌ శ్రీ అవార్డ్‌తో సత్కరించింది.

Next Story