రణపాల ఆకుతో ఆరోగ్యం.. ఆ రోగాలకు చెక్

390

దిశ, వెబ్‌డెస్క్ : ఆరోగ్యాన్ని ఎవరు కోరుకోరు.. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అయితే మన పెద్దవారు చెబుతుంటారు కొన్ని వ్యాధులు నయం కావాలంటే ఆకు పసరు తాగాలి అని, ఈ కాలంలో ఇవన్నీ ఎవరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారా.. వారు ఆ చిట్కాలు పాటించకపోయినా కానీ వాటిలో చాలా ఔషధ గుణాలుంటాయి. ముఖ్యంగా రణపాలాకు, చాలా సమస్యలకు చెక్ పెడుతోంది.  దీని వలన అనేక వ్యాధులు నయం అవుతాయి. ఇప్పుడు ఈ ఆకులు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం..

  • కిడ్నీలో రాళ్లు కరిగిచండంలో రణపాల ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఆకులను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తిన్నా, లేకుంటే 30 ఎం ఎల్ మోతాదులో కషాయాన్ని తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. అంతేకాకుండా మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది.

  • చాలా మంది ఫైల్స్‌తో బాధపడుతుంటారు. ఈ సమస్య తగ్గడానికి ఎన్ని మందులు వాడినా కొందరిలో ఫలితం కనిపించదు. అయితే ఈ సమస్య తగ్గడానికి రణాపాల రసం ఉపయోగ పడుతోంది. రణపాల ఆకు రసాన్ని తీసుకోవడం వల్ల పైల్స్ బాధ త్వరగా పోతుంది.

  • రణపాల ఆకులను చూర్ణం చేసి నుదిటిపై పట్టులాగా వేయడం వల్ల తల నొప్పి త్వరగా తగ్గుతుంది. శ‌రీరంలో వాపులు త‌గ్గుతాయి. ర‌ణ‌పాల ఆకుల‌ను పేస్ట్‌లా చేసి క‌ట్టు క‌డుతుంటే కొవ్వు గ‌డ్డ‌లు, వేడి కురుపులు త‌గ్గుతాయి.

  • దెబ్బలు తగిలిన గాయాలకు ఆకులను కొద్దిగా వేడి చేసి గాయం మీద కట్టాలి. దీని వల్ల గాయం త్వరగా మానుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంచేందుకు సహాపడుతుంది.