హెచ్‌సీఎల్‌లో 15,000 ఉద్యోగాలు!

by  |
హెచ్‌సీఎల్‌లో 15,000 ఉద్యోగాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 15,000 ఉద్యోగాలకు కొత్తవాళ్లను తీసుకోనున్నట్టు ప్రకటించింది. బలమైన డిమాండ్, వృద్ధి అంచనాలతో టెక్నాలజీ కంపెనీలు కొవిడ్-19 ప్రభావం నుంచి కోలుకుని ఫ్రెషర్లకు ఉద్యోగాలను ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హెచ్‌సీఎల్ టెక్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను వెల్లడించింది. 2019లో మొత్తం 9,000 మందిని రిక్రూట్ చేసిన హెచ్‌సీఎల్ ఈసారి అదనంగా మరో 6,000 మందిని తీసుకోవడానికి సిద్ధమైంది. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇతర కంపెనీల బాటలోనే హెచ్‌సీఎల్ కూడా వర్చువల్ విధానంలోనే ఈ నియామకాలను పూర్తి చేయనుంది. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వల్ల క్యాంపస్‌లలో ఫ్రెషర్లను ఎంపిక చేసే ప్రక్రియ నెమ్మదిగా ఉందని, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు వెయ్యి మందిని నియమించుకున్నట్టు పేర్కొంది. ఖాళీలను పూరించడం, వృద్ధి ప్రక్రియలో భాగంగా ఈ నియామకాలు ఉండనున్నట్టు, అలాగే, ప్రస్తుత సంవత్సరంలో కంపెనీ నుంచి వెళ్లే ఉద్యోగుల సంఖ్య తక్కువగానే ఉన్నట్టు హెచ్‌సీఎల్ హెచ్ఆర్ హెడ్ అప్పారావు చెప్పారు. ఇటీవల హెచ్‌సీఎల్ టెక్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన సీఈవో విజయకుమార్..ఈ త్రైమాసికంలో బలమైన డిమాండ్ ఉందని తెలిపారు.



Next Story

Most Viewed