తొలగింపుల్లేవ్..బోనస్‌లిస్తాం: హెచ్‌సీఎల్

by  |
తొలగింపుల్లేవ్..బోనస్‌లిస్తాం: హెచ్‌సీఎల్
X

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం నేపథ్యంలో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధిస్తున్నాయి. అయితే ఓ ఐటీ దిగ్గజ కంపెనీ మాత్రం ఏకంగా బోనస్‌లు ఇస్తామని ప్రకటించండంతో సంచలనంగా మారింది. అలాగే ఉద్యోగులను తొలగించడం లేదని, వేతనాల్లో కూడా కోత విధించడం లేదని తెలిపింది. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా ఐటీ సంస్థలు తెరుచుకోలేదు. ఉద్యోగుల్లో 90 శాతం మంది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కంపెనీలు ఆర్థిక నష్టాల్లో ఉండటంతో వేతనాల్లో కోత విధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది ఇచ్చిన బోనస్ హామీని లాక్‌డౌన్ సమయంలో నెరవేరుస్తామని దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ వెల్లడించింది. గతంలో వచ్చిన ప్రాజెక్టులు ఏవీ రద్దు కాలేదని, కొత్తగా ప్రాజెక్టులు రావడానికి సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది. గతేడాది కాలంగా తమ ఉద్యోగులు చేసిన పనిని తాము గౌరవిస్తామని, దీనికి కట్టుబడే బోనస్ ఇస్తున్నట్లు సంస్థ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్‌ వీవీ అప్పారావు వెల్లడించారు. 2008 ఆర్థిక మాంద్యం సమయంలోను హెచ్‌సీఎల్ ఉద్యోగులను తొలగించలేదని, వారి వేతనాల జోలికీ వెళ్లలేదని అప్పారావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామన్నారు.



Next Story

Most Viewed