Police: పోలీసులను పరిగెత్తించిన గ్రామస్థులు

by  |
Police: పోలీసులను పరిగెత్తించిన గ్రామస్థులు
X

దిశ, బాల్కొండ: పోలిస్ లపై గ్రామస్థులు తిరగబడి ఊరి నుంచి వెళ్లగొట్టిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు లాఠీలకు పని చెప్పారని ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై తిరగబడి రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ధ్వంసం అయింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హసకొత్తూర్ లో సిద్ధార్థ్ (18) యువకుడు హత్యకు గురైన సంఘటన ఉద్రిక్తలకు దారి తీసింది. యువకుడి హత్యకు కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బాధితులు శుక్రవారం హసకొత్తూర్లో ఆందోళనకు దిగారు. సిద్ధార్థ్ ను ఇంటినుంచి తీసుకెళ్లిన అతని స్నేహితుడిని గ్రామస్థుల సమక్షంలోనే విచారించాలన్నారు.

అలానే సిద్ధార్థ్ హత్యకు గల కారణాలను బహిర్గత పరుచాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని సముదాయించేందుకు యత్నించి ప్రధాన సాక్షిని స్టేషన్కు తరలించే క్రమంలో గ్రామస్థులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల పై ఆగ్రహానికి గురైన గ్రామస్థులు పోలీస్ వాహనాలపై బండరాళ్లతో దాడి చేశారు. దీంతో పెట్రోలింగ్ వాహనం ధ్వంసం అయింది. పోలీసులు శుక్రవారం సీన్ రిక్రియేషన్ కోసం ప్రయత్నం జరుగగా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. చివరకు గ్రామస్థులు మాకుమ్మడిగా వచ్చి పోలీసులు గ్రామంలో ఉండకూడదని వారు ఊరినుంచి వెళ్లిపోవాలని ఊరు పోలిమేర వరకు తరిమారు.

Next Story

Most Viewed