సూర్యచంద్రులు అతడి ఫొటోల్లో ఆటబొమ్మలు

by  |
సూర్యచంద్రులు అతడి ఫొటోల్లో ఆటబొమ్మలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక్క ఫొటో.. ఎన్నో భావాలను పలికిస్తుంది. ఎన్నో జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. అయితే ఆ ఫొటోలను అంత భావాత్మకంగా తీయగలగడంలో ఫొటోగ్రాఫర్ ఇమేజినేషన్, క్రియేటివిటీకి లిమిట్ అంటూ ఉండదు. గుడ్ ఫొటోగ్రాఫర్ అనేవాడు ఎమోషనల్ మూమెంట్స్‌‌తో పాటు ఫొటోకు లైఫ్‌‌ను కూడా తీసుకొస్తాడు. హర్యానాకు చెందిన 21 ఏళ్ల ‘సులభ్ లంబా’ అనే ఫొటోగ్రాఫర్ ఫొటోనే కాన్వాస్‌గా చేసుకుని సూర్య, చంద్రులను అందమైన ఫొటోలుగా చిత్రిస్తున్నాడు. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. నెటిజన్ల అభినందనలు అందుకుంటున్నాడు.

కొండ మీద నుంచి ఓ బండరాయిని తోసేసినట్లు.. సూర్యుడిని తోసేస్తాడు, చేతిలో పట్టుకున్న చిన్న కొమ్మల అంచున.. సూరీడు నిండుగా విచ్చుకున్న పూబంతిలా కనిపించేలా చేస్తాడు. అంతేకాదు ఆ సూర్యబంతి పువ్వును తన స్నేహితుడికి బహుమతిగా ఇస్తున్నట్లు మరో ఫొటోలో చూపించడం లంబాకే సాధ్యం. ఓ చెట్టు అపురూపంగా తన కొమ్మలతో చంద్రున్ని పట్టుకుంటే.. అందులో ఓ మనిషి పక్షిలా రెక్కలతో ఎగిరిపోతూ కనిపిస్తాడు, ఓ క్రికెటర్ తన బ్యాటుతో సూర్యున్ని బంతిలా భావించి కొట్టడం, గాలంతో సూర్యున్ని పైకి లాగడం.. ఇవన్నీ తన ఊహల్లో, తన కెమెరాలో బంధీ అయిన ఫొటోలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఇలా ఫొటోలు తీయడమే కాదు.. ఆ ఫొటోలతో చిన్నపాటి కథలు అల్లడం కూడా లంబా ఆలోచన విధానం ఎంత విభిన్నంగా ఉంటుందో తెలియజేస్తుంది. ఓ ఇద్దరు స్నేహితులు సూర్యున్ని బంతిగా చేసుకుని ఓ వైపు తంతే.. మరోవైపున్న వ్యక్తి సూర్యుడికి తగిలి ఎగిరి పడిపోవడం చూస్తే నిజంగా అద్భుతంగా క్యాప్చర్ చేశాడనిపిస్తుంది. అతని క్రియేటివిటీ, మెస్మరైజింగ్ ఫొటో స్కిల్స్ చూస్తే.. నిజంగా అతడి టాలెంట్‌ను మెచ్చుకోకుండా ఉండలేరు. సూర్యచంద్రులే కాదు.. ప్రకృతి అందాలు కూడా తన కెమెరాలో మరింత అందంగా ముస్తాబవుతాయి. పల్లె జీవన విధానాలు కూడా అతడి ఫ్రేములో మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. ఖుదోస్ టు యంగ్ అండ్ టాలెంటెడ్ ఫొటోగ్రాఫర్ లంబ.

Next Story

Most Viewed