నీరజ్ చోప్రాకు హర్యానా సర్కార్ బంపర్ ఆఫర్..

by  |
neeraj chopra
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌‌ జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా గురించి ప్రస్తుతం దేశం చర్చించుకుంటోంది. నీరజ్‌కు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నీరజ్ చోప్రాకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన చోప్రాకు హర్యానా ముఖ్యమంత్రి రూ.6 కోట్ల నగదు ప్రోత్సాహకం ప్రకటించారు.

అంతేకాకుండా గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, 50శాతం రాయితీతో ఇంటి స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ విజయాన్ని యావత్భారతం సెలబ్రేట్ చేసుకుంటుండగా.. కుమారుడి విజయంపై ఆయన తండ్రి సతీశ్ కుమార్ స్పందించాడు. కొడుకు కష్టాన్ని చూసినపుడే బంగారు పతకం వస్తుందని ఊహించానని చెప్పుకొచ్చాడు. ఇదిలాఉండగా నీరజ్ చోప్రా 2021 టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్‌తో పాటు ఏషియన్ గేమ్స్ 2016, 2018లో స్వర్ణం, 2018 కామన్ వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాడు.

Next Story