ఎంత దారుణం.. మాట్లాడినా కరోనా వ్యాపించేస్తోంది..!

by  |
ఎంత దారుణం.. మాట్లాడినా కరోనా వ్యాపించేస్తోంది..!
X

కరోనా మహమ్మారి తుమ్మినా లేదా దగ్గినా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందంటూ, కనీసం మీటరు దూరం సామాజిక దూరం పాటించాలంటూ ప్రపంచ దేశాలు అవగాహన కల్పిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది సరికాదని, కరోనా సోకిన వ్యక్తి పక్కనే ఉండి మాట్లాడినా లేదా అతని పక్కనే కూర్చుని గాలిని పీల్చుకున్నా కూడా వైరస్ సోకే ప్రమాదముందని తాజాగా ఒక అధ్యయనం వెల్లడిచింది.

యూఎస్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, డాక్టర్ హార్వే ఫినెబర్గ్ అధ్యక్షతన కరోనా వైరస్ ఆనుపానులపై వైట్ హౌస్ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు దానిపై సమగ్రమైన పరిశోధన చేసి, దాని ఫలితాలను వైట్ హౌస్‌కు తెలిపారు. ఈ నివేదికలో కరోనా బారి నుంచి రక్షణ పొందేందుకు ఏదో ఒక మాస్క్ వేసుకునే బయటకు కాలు పెట్టడం మంచిదని తాను అభిప్రాయపడుతున్నానని ఈ కమిటీకి నాయకత్వం వహించిన హార్వార్డ్ స్కూల్ పబ్లిక్ హెల్త్ విభాగం మాజీ డీన్, ఎన్ఏఎస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ హార్వే ఫినెబర్గ్ సీఎన్ఎన్ వార్తా సంస్థతో అన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్‌పై జరిగిన పరిశోధనలు చాలా తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. సాధారణంగా పీల్చే ఊపిరితో కూడా కరోనా వైరస్ క్రిములు శరీరంలోకి వెళ్లిపోతున్నాయని ఆయన చెప్పారు.

ప్రతి ఒక్కరూ సర్జికల్ మాస్క్ ను ధరించాలని తాను భావించడం లేదని, అయితే అదే సమయంలో ముక్కు నోటికి ఏదో ఒక ఆచ్ఛాదన మాత్రం ఉండాల్సిందేనని ఆయన చెప్పారు. ఎందుకంటే, సర్జికల్ మాస్కుల అవసరం వైద్యులకు చాలా ఉందని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కార్యాలయంలోని కెల్విన్ డ్రాయిగ్ మెయిర్ సంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తూ, కరోనా వైరస్ మాట్లాడటం ద్వారా కూడా వ్యాపించవచ్చునన్నారు. తుమ్మినా, దగ్గినా ఆ తుంపరల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుందని చెప్పారు. ఈ వైరస్ రోగుల నుంచి డైరెక్ట్ గా విడుదల అయ్యే బయో ఏరోసోల్స్ ద్వారా కూడా వ్యాపిస్తుందని ఆయన తెలిపారు.

కరోనా సోకిన రోగికి ఆరు అడుగుల దూరంలో ఉన్న వ్యక్తికి కూడా తుమ్ము లేదా దగ్గు వల్ల వైరస్ వ్యాపిస్తుందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిని నిర్ధారించిన ఆయన చైనాలోని ఓ ఆసుపత్రిలో కరోనా రోగుల గదులను శుభ్రపరిచిన తరువాత, ప్రొటెక్టివ్ వేర్ ధరించిన స్టాఫ్ అటూ ఇటూ తిరుగున్నప్పుడు, వైరస్ గాల్లోనే నశిస్తోందని తేలిందని వెల్లడించారు. కరోనా పేషంట్లకు ఆరు అడుగుల దూరంలో కూడా కరోనా వైరస్‌ను గుర్తించామని యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా రీసెర్చ్ తేల్చిందని ఆయన తెలిపారు.

Tags: corona, american reserch, white house, spreading on rapid speed, spreading in talking, usa, nasa,harvey fineberg

Next Story

Most Viewed