కేసీఆర్ సీఎం అయ్యింది ఉద్యమాలతోనే..

by  |
కేసీఆర్ సీఎం అయ్యింది ఉద్యమాలతోనే..
X

దిశ,వెబ్‌డెస్క్
తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమాలతోనే సాధారణ కేసీఆర్ కాస్త సీఎం కేసీఆర్ అయ్యారని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.రాష్ట్రంలోజరుగుతున్ననిర్భందాలను వెంటనే ఆపాలని కోరుతూ శనివారం డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం కూడా బలంగా లేదని అలాంటప్పడు ఈ నిర్భందాలు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో సభలు, సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ లేకుండా పో్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే అరెస్టు చేసిన ప్రజాసంఘాల నేతలను బేషరతుగా విడిచిపెట్టాలని, భవిష్యతులో చేయబోయే అరెస్టులను కూడా ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.పోరాటాల ద్వారానే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని, అది మరువలేని చారిత్రకమని వివరించారు.కేసీఆర్ ఉద్యమాలతోనే సీఎం అయ్యారని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడం లేదు, దీనిపై కేసీఆర్‌ను ప్రశ్నించే హక్కు తమకు ఉందన్నారు. డీజీపీని కలిసిన వారిలో పలువురు ప్రజాసంఘాల నాయకులు ఉన్నారు.
Read also..

‘సోనా’కు మాకు సంబంధం లేదు..

Next Story