దొంగలు ఎత్తుకెళ్లిన వడ్లు బాధితురాలికి అప్పగింత

by  |
Vadlu-Recovery1
X

దిశ, నవీపేట్: బాధితురాలు దళిత మహిళా రైతుకు పోలీసులు వడ్లు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని నిజాంపూర్ విలేజ్ కి చెందిన దళిత మహిళా రైతు పిట్ల లక్ష్మికి చెందిన వరి పంటను అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు కోసుకెళ్లారు. దీంతో ఆ మహిళా రైతు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నవంబర్ 1న నిజాంపూర్ మల్లేష్ గౌడ్, మహేష్ గౌడ్ లు తన పంటను కోసుకెళ్లారని ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల నుంచి వడ్లను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన 10 క్వింటాళ్ల వడ్లను బాధితురాలు లక్ష్మికి అందజేశారు.

Next Story