మార్కల్‌లో సగం కాలిపోయి ఉన్న యువతి మృతదేహం లభ్యం

110
women-deadbody-1

దిశ, సదాశివనగర్: సదాశివనగర్ మండలంలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మండలంలోని మార్కల్ గ్రామ శివారులో సగం కాలిపోయి ఉన్న గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..