ఆ సైట్లు చూస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త

424

ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో సాధారణం కావడం అలాగే డేటా కూడా అందుబాటులో ఉండటంతో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో పాటు ఖాళీ సమయంలో చాలామంది ఆ వీడియోలకు అడిక్ట్ అవుతున్నారు. అలా అడిక్ట్ అయినందుకు ఓ టెకి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.

బెంగుళూరులో నివసించే ఓ టెకీ ఖాళీ సమయంలో నెట్‌లో పోర్న్‌ సైట్లు చూడటం అలవాటు చేసుకున్నాడు. ఇది ఇలా కొనసాగుతుండగా అతని అకౌంట్ ని హ్యాక్ చేసిన హ్యాకర్ మూడు చెరువులు నీళ్లు తాగించాడు.. ఈ మెయిల్ ద్వారా అతని రహస్యాలను పంపించి బిట్ కాయిన్లు చెల్లించాలని ఎరవేశాడు.

కంప్యూటర్‌లోకి హ్యాకర్‌ బెంగుళూరు టెకీ నెట్‌లో పోర్న్‌ దృశ్యాలు చూస్తున్న సమయంలో అతని కంప్యూటర్‌లోకి హ్యాకర్‌ ప్రవేశించాడు. వెబ్‌ కెమెరాను తన కంట్రోల్‌లోకి తీసుకొన్నాడు. అతని కాంటాక్ట్‌ లిస్ట్‌ను హ్యాక్‌ చేశాడు.

అతని వ్యక్తిగత దృశ్యాలను.. టెకికు తెలియకుండానే వెబ్‌ కెమెరా సాయంతో అతని వ్యక్తిగత దృశ్యాలను రికార్డ్‌ చేశాడు. దాని ఆధారంగా ఒక సెక్స్‌ టేప్‌ను సిద్ధం చేశాడు.

విలువైన బిట్‌కాయిన్లను దాన్ని మెయిల్‌కు పంపి 2600 డాలర్ల విలువైన బిట్‌కాయిన్లను చెల్లించు. లేదంటే నీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారికీ, కుటుంబ సభ్యులకు ఈ సెక్స్‌ వీడియో పంపుతానని బెదిరించాడు.

తొమ్మిది సోర్సుల నుంచి.. ఇదో ఫేక్‌ ఈమెయిల్‌గా భావించిన టెకీ.. ఎందుకైనా మంచిదని కంప్యూటర్‌లోని పర్సనల్‌ విషయాలు భద్రంగా ఉన్నాయో లేవో చూసుకొన్నాడు. తొమ్మిది సోర్సుల నుంచి తన కాంటాక్ట్స్‌ హ్యాక్‌ అయ్యాయని తెలుసుకొని కంగుతిన్నాడు.
పోర్న్‌ సైట్ల ద్వారానే .. హ్యాకర్లు ఎక్కువగా పోర్న్‌ సైట్ల ద్వారానే మన ఫోన్లు, కంప్యూటర్లలోకి ప్రవేశిస్తున్నారు.

So Be Alert 

Read More :అందాల తారల Instagram ముచ్చట్లు

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..