మంగళగిరిలో కలకలం.. నలుగురు పిల్లలు మిస్సింగ్

109
Children missing

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిలో నలుగురు పిల్లలు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. సోమవారం ఉదయం నిడమర్రు రోడ్డులోని మున్సిపల్ స్కూల్‌కు వెళ్లిన పిల్లలు రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.