గుడివాడ టూటౌన్ ఎస్సై సూసైడ్..

by  |
గుడివాడ టూటౌన్ ఎస్సై సూసైడ్..
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. తన అపార్ట్‌మెంట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

విజయ్ కుమార్ కు మూడు నెలల క్రితం వివాహం అయింది. అయితే భార్యను కాపురానికి తీసుకురాకుండా గుడివాడలో ఓ బ్యూటీషియన్‌తో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తుండగా బ్యూటీషియన్‌తో పరిచయం కావడంతో అప్పటి నుంచి ఆమెతో ఉంటున్నట్లు సమాచారం. కాగా, గతంలో విజయ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed