ట్రెండింగ్: ఈలన్ మస్క్ కొడుకు పేరు అర్థమేంటో తెలుసా?

by  |
ట్రెండింగ్: ఈలన్ మస్క్ కొడుకు పేరు అర్థమేంటో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టెస్లా సీఈఓ ఈలన్ మస్క్, ఆయన గర్ల్‌ఫ్రెండ్ గ్రైమ్స్‌కి మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు X Æ A-12 అని పేరు పెట్టారు. ఇదేం పేరురా బాబు అంటూ ఇంటర్నెట్లో బోలెడన్ని మీమ్స్ వచ్చాయి. ఎంత టెక్నాలజీ మీద పని చేస్తే మాత్రం ఇలాంటి పలకరాని పేరేంటి అని కామెంట్లు చేస్తున్నారు. ఈ పేరును చట్టపరంగా రిజిస్టర్ చేయడానికి కూడా వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పేరు అర్థాన్ని వివరిస్తూ గ్రైమ్స్ ఒక ట్వీట్ చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె ట్వీట్ కూడా చాలా మందికి అర్థం కాట్లేదు.

X Æ A-12లో X అంటే ఒక అనిశ్చిత చలరాశి, Æ అంటే ఎల్విన్ భాషలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రేమకు చిహ్నం, A-12 అంటే తమ ఫేవరెట్ ఎయిర్‌క్రాఫ్ట్ SR-17 లేదా SR-71కి ప్రీ కర్సర్ అని గ్రైమ్స్ వివరించింది.

Tags – Elon Musk, Grimes, Baby name, X Æ A-12, meaning, twitter, trending, memes, comments

Next Story