పశ్చిమగోదావరిలో మత్స్య విశ్వ విద్యాలయం

by  |
పశ్చిమగోదావరిలో మత్స్య విశ్వ విద్యాలయం
X

దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లాలో మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చైనా అకాడమీ సాంకేతిక సహకారంతో ఆనంద్ గ్రూప్‌తో కలిసి పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నలిచ్చింది. రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్ల వ్యయంతో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనివర్సిటీ ద్వారా ఆక్వా రంగంపై ఆధారపడిన రైతులకు ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిపుణుల కొరత వల్ల ప్రతి ఏటా ఆక్వా రైతులు రూ.2,500 కోట్లు నష్టపోతున్నారు. యూనివర్సీటి ఏర్పాటు ద్వారా నష్టాన్ని అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story

Most Viewed