ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి : చాడ వెంకట్ రెడ్డి

by  |
Chada Venkat Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వస్తున్న అకాల వర్షాలు కారణంగా మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, తదితర ఉమ్మడి జిల్లాల్లో ధాన్యం తడవడంతో రైతులకు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోనె సంచుల కొరత, హమాలీల కొరత లేకుండా నిల్వ ఉన్న ధాన్యం కొనుగోళ్లను రెండు, మూడు రోజుల్లోనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోడౌన్లలోకి తరలించాలని, రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed