కరోనా సంబంధిత వస్తువుల దిగుమతులపై ఐజీఎస్టీ తొలగింపు

by  |
కరోనా సంబంధిత వస్తువుల దిగుమతులపై ఐజీఎస్టీ తొలగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉచిత పంపిణీలో భాగంగా భారత్ వెలుపల నుంచి విరాళ రూపంలో గాని, ఉచితంగా గాని అందుకున్న కొవిడ్ సంబంధిత వస్తువులపై ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ(ఐజీఎస్టీ)ని మాఫీ చేస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఉపశమనం జూన్ 30 వరకు ఉంటుందని తెలిపింది. ఇటీవల కరోనా సంబంధిత పదార్థాల దిగుమతులకు ఐజీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ భారత్ వెలుపల ఉన్న స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఇతర అసోసియేషన్ల నుంచి ప్రభుత్వానికి అభ్యర్థనలు వచ్చినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే ప్రభుత్వం రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్, దానీ ఏపీఐలు, కరోనా టీకా, ఇన్‌ఫ్లమేటరీ డయగ్నస్టిక్ కిట్లు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఇంకా ఇతర పరికరాల దిగుమతులపై కస్టమ్స్ సుంకం మినహాయింపును ఇచ్చింది. సోమవారం ఇచ్చిన ఐజీఎస్టీ మినహాయింపు రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన నోడల్ అధికారులకు లోబడి ఉంటుంది. ఆయా వస్తువులు ఇచితంగా పంపిణీ చేసేందుకు ఏదైనా సంస్థ, సహాయ, చట్టబద్ధ సంస్థలకు అధికారం ఉంటుంది. వీటిని దేశంలో ఎక్కడైనా ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ, సంస్థలు ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు. కస్టమ్స్ నుంచి వస్తువులను క్లియరెన్స్ చేసే ముందు దిగుమతిదారు ఆయా వస్తువులను ఉచితంగా పంపిణీ చేయడం కోసమనే ధృవీకరణ పత్రాన్ని నోడల్ అధికారుల నుంచి తీసుకోవాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Next Story