రీఫండ్‌లు తక్షణమే విడుదల..ఐటీ శాఖ!

by  |

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కష్టకాలంలో ఆదాయం కోల్పోయిన, వ్యాపారాలు నిలిచిపోయిన వారికి కేంద్రం శుభవార్త అందించింది. ఐటీ శాఖా నుంచి జరగాల్సిన చెల్లింపుల మొత్తాలను వెంటనే విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది. రూ. లక్షల లోపు ఉన్న రీఫండ్‌లను వెంటనే చెల్లించేలా ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. ఈ చెల్లింపులతో దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంద్,అని అధికారులు తెలిపారు. అలాగే, పెండింగ్‌లోని కస్టమ్స్ రీఫండ్, జీఎస్టీలు రూ. 18,000 కోట్లను కూడా విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. కొవిడ్-19 వల్ల తప్పనిసరై వ్యాపారాలను మూసేసినవారు, చెల్లింపుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ ఉపశమనం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదాయపన్ను విభాగం స్పష్టం చేసింది. ఆదాయశాఖ నిర్ణయంతో లక్షలాది సూక్ష్మ, చిన్న, మధ్య తరహ సమస్థలు ప్రయోజనాలు పొందుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కొవిడ్-19 మహమ్మారి విజృంభించడంతో 2019 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌ను జూన్ 30 పొడిగించినట్టు ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags : Income Tax Refund, Income, Itr RefundTax, Department, Refund

Next Story