జీఎస్టీ తగ్గింపు పరిశ్రమకు ఎంతో మేలు -టాటా మోటార్స్

by Harish |
జీఎస్టీ తగ్గింపు పరిశ్రమకు ఎంతో మేలు -టాటా మోటార్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ తగ్గింపు విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించినా అది ప్యాసింజర్ వాహనాల విభాగానికి ఎంతో సహాయపడుతుందని టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, ఇటీవల బీఎస్6 ఉద్గార నిబంధనలకు మారడం వల్ల వాహనాల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీఎస్టీ తగ్గిపును అమలు చేస్తే మేలని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో వివిధ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వినియోగదారులకు వాహనాల ధరల తగ్గింపు ఎంతో మేలు చేస్తుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేశ్ చంద్ర చెప్పారు. బీఎస్4 నుంచి బీఎస్6కి మారడం వల్ల వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వినియోగదారులు తమ వేతనాలు, ఉద్యోగంతో సహా భవిష్యత్తుపై ఆందోళనలతో ఉన్నారు.

ఇలాంటి సమయంలో వాహనాల ధరల పెరుగుదల ఖచ్చితంగా పరిశ్రమను ప్రభావితం చేస్తుంది. ఈ ధరల పెరుగుదలను తగ్గించేందుకు ప్రభుత్వం జీఎస్టీని తగ్గింపు మద్దతు మొత్తం ప్యాసింజర్ వింభాగంలో డిమాండ్‌ను ఖచ్చితంగా పెంచుతుందని శైలేశ్ చంద్ర పేర్కొన్నారు. ఆటో కంపెనీలు తమ సౌకర్యాలను, ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేసేందుకు సుమారు రూ. 40 వేల కోట్లను, ఆటో కాంపొనెంట్ పరిశ్రమ సుమారు రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను పెడుతున్నాయని ఆయన వివరించారు.

Next Story

Most Viewed