చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలి

by  |

దిశ, న్యూస్‌బ్యూరో :
కొవిడ్-19 మహమ్మారి కారణంగా చేతివృత్తిదారులు జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలంగాణ వృత్తి సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపాముల వెంకట్రాములు అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటనలో పలు అంశాలు ప్రస్తావించారు. నెల రోజుల నుంచి రాష్ట్రంలో రవాణ వ్యవస్థ స్థంభించిపోవడంతో చేనేత వృత్తిదారులకు నూలు, రసాయనాలు తదితర ముడిసరుకులు లేక మగ్గాలు మూతపడ్డాయన్నారు. చేపలు పట్టుకుని జీవనం సాగించే మత్స్యకారులకు కరోనా అశనిపాతంలా మారిందని, కోట్లాది మత్స్య సంపద జలాశయాల్లోనే ఉండిపోతున్న దుస్థితి నెలకొందని వాపోయారు. ఈ నెలలో చేపల వేట జరిగినా అమ్ముడుపోక మత్స్యకార్మిక కుటుంబాల జీవనం కష్టంగా మారిందన్నారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక సాయం కింద రూ.10 వేలు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని కోరారు. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ఉచిత బియ్యం, ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

Tags: ration, bank, fishermen, economy, coronavirus, lockdown

Next Story

Most Viewed