ఈపీఎఫ్ తీసుకోండి!

by  |
ఈపీఎఫ్ తీసుకోండి!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వ లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసరంగా నగదు ఇబ్బందుల్ను అధిగమించేందుకు ఈపీఎఫ్ అకౌంట్ల నుంచి సొమ్ము తీసుకునేందుకు కేంద్ర కార్మిక శాఖ అవకాశం ఇచ్చింది. ప్రతి ఉద్యోగి మూడు నెలల జీతాన్ని, డీఏ లేదంటే ఈపీఎఫ్ నుంచి 75 శాతం ఉపసమ్హరించుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ రెండింటిలో ఏది తక్కువ ఉంటే దాన్ని తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనికోసం ఈపీఎఫ్ అవసరమైన ఉద్యోగులు ఆన్‌లైన్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. అంతేకాకుండా, ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డోఉన్ నేపథ్యంలో ఉద్యోగులకు, కార్మికులకు మార్చి 22 నుంచి 31 వరకు జీతంతో కూడిన సెలవులను మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి కార్మికశాఖ కార్యదర్శి అహ్మద్ ఉత్తర్వులు ఇచ్చారు.

Tags: epf, employees, epf accounts, coronavirus effect

Next Story

Most Viewed