ఆకట్టుకుంటున్న ‘గోవిందా భజ గోవిందా’ సినిమా పోస్టర్..

by  |
ఆకట్టుకుంటున్న ‘గోవిందా భజ గోవిందా’ సినిమా పోస్టర్..
X

దిశ, వెబ్‌డెస్క్ : విజయ శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌లో డాలీ ప్రెసెంట్స్ చేస్తున్న “గోవిందా భజ గోవిందా” అనేది మెయిన్ టైటిల్‌ కాగా AIR FORCE BATCH అనేది ఉప శీర్షికతో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించి ఆదివారం మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. సినిమాను సూర్య కార్తికేయ అను కొత్త ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నారు. సినిమా ఆద్యంతం కామెడీగా ఉంటుందని, మీరందరూ ఫ్యామిలీతో వచ్చి చూసి నవ్వుకోవచ్చని డైరెక్టర్ సూర్య కార్తికేయ చెప్పారు. తాను ఎన్నో సినిమాలకు సహా దర్శకుడిగా చేసి ఇప్పుడు తానే సినిమాని నిర్మించుకుంటున్నానని తెలిపారు.

సినిమా చాలా బాగా వచ్చిందని, క్వాలిటి విషయంలో ఎక్కడా తగ్గలేదన్నారు. మీ ఆశీర్వాదాలు తమపై ఉండాలని, ఒక మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు. అలాగే మా సినిమాని ఆదరిస్తారనే ఉద్దేశంతోనే సినిమాను కొత్త వారితో తీశామన్నారు. అందరూ బాగా నటించరాని, సినిమాని చూసిన తర్వాత మీరే చెప్తారని సూర్య వెల్లడించారు. సినిమా టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని, పోస్టర్ డిజైన్ బాగుందని చాలా మంది చెబుతున్నారన్నారు. మీ ప్రేమాభిమానాలు మా సినిమా పై ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.మేము చేసిన ప్రయత్నానికి మీ ప్రేమాభిమానాలే తమ సినిమాకు ఆశీస్సులని డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన సూర్య కార్తికేయ చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు సినీ ప్రేక్షకులకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.


Next Story

Most Viewed