ఆరోగ్య శ్రీ లిమిట్ పెంచనున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై ఎన్ని లక్షలు వరకు అంటే..?

by  |
arogya sri
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఇక నుంచి 5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. గతంలో ఉన్న 2 లక్షల లిమిట్‌ను 5 లక్షలకు పెంచాలని ప్రభుత్వం అంతర్గత నిర్ణయం తీసుకున్నది. అతి త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నది. ఈ మేరకు నెట్‌వర్క్​ ఆసుపత్రుల అభిప్రాయాన్ని కూడా వైద్యశాఖ సేకరించింది. ఇటీవల కాలంలో చిన్న రోగాలకు కూడా అత్యధికంగా చికిత్స ఖర్చులు అవుతున్నాయి.

దీంతో పేదలకు అదనపు భారం పడుతున్నది. ఈక్రమంలో సీఎం కేసీఆర్ సూచనతో ఆరోగ్యశ్రీ పథకం లిమిట్‌ను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. కుటుంబంలో ఎక్కువ మందికి ఒకే సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు వస్తే పెంచిన లిమిట్​ఎంతో ఉపయోపడుతుందని ఆరోగ్యశ్రీ విభాగంలోని ఓ అధికారి దిశకు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్య శ్రీ ద్వారా 1028, ఆయూష్మాన్ భారత్‌లో 1668 వ్యాధుల ప్యాకేజ్ ఉన్నది. ఈ రెండింటిని కలుపుతూ ఇప్పటికే చికిత్సను అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది.

దీంతో ఈ రెండు స్కీంలలో కామన్ వ్యాధులుగా 1020 ఉండగా, మరో 646 ఆయూష్మాన్ భారత్ కింద చికిత్సను అందించనున్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ కు 79 లక్షల కుటుంబాలు అర్హత ఉండగా, ఆయూష్మాన్ భారత్‌ను సుమారు మరో 29.11 లక్షల కుటుంబాలు కలిగి ఉన్నాయి.

Next Story

Most Viewed