ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ సంస్థల్లో 100 శాతం ఎఫ్‌డీఐకి ముసాయిదా

by  |
ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ సంస్థల్లో 100 శాతం ఎఫ్‌డీఐకి ముసాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ సంస్థల్లో పూర్తిగా 100 శాతం వరకు విదేశీ పెట్టుబడులను అనుమతించాలని ప్రతిపాదనపై వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ముసాయిదా కేబినెట్ నోట్‌ను విడుదల చేసింది. దీన్ని గనక కేబినెట్ ఆమోదిస్తే దేశీయ అతిపెద్ద చమురు రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రైవేటీకరణకు వీలవుతుంది. తాజా ముసాయిదాతో బీపీస్సీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్నటువంటి 52.98 శాతం వాటాను ప్రైవేటుకు వెళ్లిపోనుంది. ఇదివరకే బీపీసీఎల్‌ను ప్రైవేటీకరణలో భాగంగా అస్సాంలో ఉన్న నుమాలీఘడ్ రిఫైనరీ నుంచి బీపీసీఎల్ వైదొలగిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే బీపీసీఎల్‌ను సొంతం చేసుకునేందుకు ప్రముఖ ప్రైవేట్ దిగ్గజం వేదాంత ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేసింది. అభిప్రాయాలను సేకరించిన తర్వాత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రివర్గ అనుమతిని కోరనుంది. ప్రస్తుతం పెట్రోలియం రిఫైనింగ్‌లో 49 శాతం ఎఫ్‌డీఐలకు మాత్రమే అనుమతి ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed