సర్కార్ కీలక నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శులకు గుడ్ న్యూస్

by  |
Indian Currency
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు పెంచుతూనే ప్రొబెషనరీ కాలాన్ని కూడా పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే అక్టోబర్ నెలతో మూడేండ్ల సర్వీసును పూర్తి చేసుకుని, రెగ్యులర్​అవుతామని ఆశించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నిరాశే ఎదురవుతోంది. అయితే వేతనాలను మాత్రం పెంచారు. రాష్ట్రంలో 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను 2018లో నియమించారు.

ముందుగా వీరికి మూడు ఏళ్లు ప్రొబెషనరీ కాలంగా తీసుకుని ఆ తర్వాత రెగ్యులర్ చేస్తామని ప్రకటించారు. ప్రొబెషనరీ సమయంలో వేతనం రూ. 15వేలుగా నిర్ధారించారు. ప్రస్తుతం పని ఒత్తిడి నేపథ్యంలో దాదాపు రెండు వేలకుపైగా ఉద్యోగులు రాజీనామా చేశారు. కాగా, ప్రస్తుతం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనాన్ని రూ. 15 వేల నుంచి రూ. 28,719కి పెంచుతున్నట్లు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ప్రొబెషనరీ కాలాన్ని మాత్రం మూడేండ్ల నుంచి నాలుగేండ్లకు పెంచుతున్నట్లు అదే జీవోలో స్పష్టం చేసింది. దీంతో జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల్లో ఆవేదన నెలకొంది.

తగ్గించాల్సిందే : పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్​

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబెషనరీ కాలాన్ని తగ్గించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్​రెడ్డి డిమాండ్​చేశారు. వారికి వేతనాలు పెంచినందుకు సంతోషమేనని, కానీ ముందుగా నియామకం సందర్భంగా మూడేండ్ల ప్రొబెషనరీ కాలాన్ని ప్రకటించి, ఇప్పుడు ఇంకో ఏడాది పెంచడం సరికాదన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని, త్వరలోనే రాష్ట్రస్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Next Story

Most Viewed