బీపీసీఎల్ వాటా అమ్మకానికి గడువు పొడిగింపు!

by  |

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అతిపెద్ద రెండో చమురు శుద్ధి సంస్థ భారత్ పెట్రోలియం కార్పోరేషన్(బీపీసీఎల్)లో సుమారు 53 శాతం వాటాను అమ్మకానికి కేంద్ర సిద్ధపడిన సంగతి తెలిసిందే. బీపీసీఎల్‌లో సగానికిపైగా వాటాను ప్రైవేట్ సంస్థలకు విక్రయించేందుకు కేంద్రం విధించిన గడువును పొడిగించింది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం బీపీసీఎల్‌లో వాటా కొనుగోలుకు మే 16 నాటికి బీడ్డింగ్‌లు సమర్పించాలని అనుకున్నప్పటికీ…ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను భయపెడుతున్న కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో బీపీసీఎల్ వాటా విక్రయాన్ని మే 16 నుంచి జూన్ 13కు పొడిగించింది.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తొలి దశలో అర్హత కలిగిన బిడ్లను ఎంపిక పూర్తయిన అనంతరం రెండవ దశలో ఎంపిక చేసిన వారి నుంచి జూన్ 13 నాటికి బిడ్లను ఆహ్వానిస్తారు. బీపీసీఎల్ సంస్థలో వాటా కొనుగోలు చేసే ప్రైవేట్ సంస్థల నికర విలువ రూ. 70 వేల కోట్లు ఉండాలి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.10 లక్షల కోట్ల విలువ కలిగిన వాటాలను ప్రైవేట్ సంస్థలకు విక్రయించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉందని గతంలో వెల్లడించింది.

tags : bpcl , bharat petroleum

Next Story

Most Viewed