104 ఇక కనిపించనట్లేనా..? రద్దు దిశగా సర్కార్

by Anukaran |   ( Updated:2021-12-07 21:35:46.0  )
104 ఇక కనిపించనట్లేనా..? రద్దు దిశగా సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్న 104 వ్యవస్థను రద్దు చేయాలని సర్కార్​ సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఆయా వాహనాల పనితీరు, ప్రజల అభిప్రాయాలను సర్కార్​ సేకరిస్తున్నది. డీఎమ్​హెచ్​ఓల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి ఓ నివేదిక ఇవ్వాలని సర్కార్​ కోరింది. ఈ సెక్టార్​లో పనిచేస్తున్న సుమారు 1250 డాక్టర్లు, ఫార్మిసిస్ట్​, ల్యాబ్​ టెక్నీషియన్లను పల్లె దవాఖాన్లలో నియమించనున్నారు.

మారుమూల గ్రామాలకు ఇబ్బందే..

పల్లె దవాఖాన్లను ఏర్పాటు చేస్తున్నందునే 104 సేవలను రద్దు చేయాలని సర్కార్​ భావిస్తున్నప్పటికీ.. ఇది గ్రామీణ ప్రాంతాల వారీగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నది. గ్రామాల్లో దీర్ఘకాలిక పేషెంట్లు, గర్భిణీలకు అత్యవసర సమయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదని స్వయంగా గ్రామీణ డాక్టర్లు చెబుతున్నారు. 108 అందుబాటులో లేని మండలాల్లో మరింత సమస్య ఉంటుందన్నారు. వాస్తవానికి ఈ వాహనంలో మందులు, మెడికల్​ కిట్లతో పాటు అత్యవసర రోగిని తరలించేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. అంబులెన్స్​లు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రస్తుతం వీటినే వినియోగిస్తున్నారు. కానీ ఇప్పుడు వీటి సేవలను పూర్తిగా బంద్​ చేయడం వలన కొన్ని ప్రాంతాల ప్రజలకు నష్టం కలిగే ప్రమాదం ఉన్నది.

Next Story

Most Viewed