ప్రజలపై ప్రభుత్వం కక్ష కడుతోంది: రఘు నందన్ రావు

by  |
ప్రజలపై ప్రభుత్వం కక్ష కడుతోంది: రఘు నందన్ రావు
X

దిశ, దుబ్బాక : దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటర్లు ఏ రకమైన తీర్పు ఇచ్చారో రేపు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదేరకంగా తీర్పు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఎమ్మెల్యే రఘునందన్ రావుకు వర్తక సంఘాల నాయకులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ… సిద్దిపేట అభివృద్ధి పనుల ప్రారంభానికి సీఎం గురువారం వస్తున్నట్లు తనకు కనీసం ఆహ్వానం లేకపోవడం బాధాకరమన్నారు.

ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు వందల , వేల కోట్లు నిధులు మంజూరు చేసినప్పుడు దుబ్బాకను ఎందుకు మరిచారని ఆరోపించారు. దుబ్బాకకు కనీసం రింగు రోడ్డును మంజూరు చేయరా అని ప్రశ్నించారు. దుబ్బాక, సిద్దిపేట రెండు కండ్ల లాంటివి అని చెప్పుకునే వాళ్లు…నిన్నటి రోజు దుబ్బాకకు నిధులు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. మీ తీరు ఇలాగే ఉంటే రేపు రానున్న సిద్దిపేట వరంగల్‌ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు మీకు సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Next Story

Most Viewed