జియోతో కలిసి చౌక స్మార్ట్‌ఫోన్ తయారీ ప్రాజెక్ట్ కొనసాగుతోంది : Google CEO Sundar Pichai

by  |
జియోతో కలిసి చౌక స్మార్ట్‌ఫోన్ తయారీ ప్రాజెక్ట్ కొనసాగుతోంది : Google CEO Sundar Pichai
X

దిశ, వెబ్‌డెస్క్: సరసమైన ధరలో స్మార్ట్‌ఫోన్ తయారీ కోసం దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్ జియోతో (JIO) కలిసి పనిచేస్తున్నట్టు ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఎఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai)వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయని సుందర్ పిచాయ్ తెలిపారు. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ తయారీపై దృష్టి సారించామని, ఈ ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికోసం జియో సంస్థతో కలిసి పనిచేస్తున్నట్టు’ సుందర్ పిచాయ్ చెప్పారు. కాగా, స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు వస్తుంది, ధర వంటి వివరాలను సుందర్ పిచాయ్ చెప్పలేదు.

గూగుల్ (Google )సంస్థ గతేడాది జియో ప్లాట్‌ఫామ్‌లో రూ. 33,737 కోట్లకు 7.7 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంతో పాటు ఎంట్రీ లెవెల్, చౌక స్మార్ట్‌ఫోన్ అభివృద్ధికి సంయుక్తంగా పనిచేసేందుకు వాణిజ్య ఒప్పందం గూగుల్ కుదుర్చుకుంది. గతేడాది జులైలో ‘గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైజేషన్ ఫండ్’ (Google launches $10 billion digitization fund in India) పేరుతో రాబోయే 5 నుంచి 10 ఏళ్లలోగా భారత్‌లో రూ. 75 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఈ పెట్టుబడుల ప్రణాలికలో భాగంగానే జియోతో కలిసి చౌక స్మార్ట్‌ఫోన్ తయారీ అని పిచాయ్ వివరించారు. త్వరలో మరిన్ని ప్రాజెక్టులను వెల్లడించనున్నట్టు, వాటి వివరాలను ఈ ఏడాది చివరి నాటికి తెలపనున్నట్టు పిచాయ్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed