గూగుల్ మీట్‌లో ‘రైజ్ హ్యాండ్’

by  |
గూగుల్ మీట్‌లో ‘రైజ్ హ్యాండ్’
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నో సంస్థలు ఇప్పటికీ తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సదుపాయాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అందరూ వర్చువల్ మీటింగ్‌లోనే కలుసుకుంటున్నారు. అయితే పబ్లిక్ మీటింగ్స్‌లోనైనా, ప్రైవేట్ మీటింగ్స్‌లోనైనా మన వాయిస్ వినిపించాలన్నా, సందేహాలు తీర్చుకోవాలన్నా చెయ్యెత్తి అడుగుతాం. గూగుల్ మీట్ వీడియో కాల్స్‌లోనూ ఇప్పటివరకు ఇదే పంథాను అనుసరించారు. కానీ ఇక ముందు చెయ్యెత్తే అవసరం లేదు. జస్ట్ ‘రైజ్ హ్యాండ్’ క్లిక్ చేస్తే చాలు.

‘వర్క్ ఫ్రమ్ హోమ్’లో వీడియో కాల్ మీటింగ్స్ సర్వసాధారణమైపోయాయి. అయితే మీటింగ్‌లో ఒకరు మాట్లాడుతున్నప్పుడు చెయ్యెత్తి వారిని డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు. మీటింగ్ ఫ్లో దెబ్బతింటుంది. అందుకే ఎవరికీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా జస్ట్ ‘రైజ్ హ్యాండ్’ అనే బటన్ క్లిక్ చేస్తే చాలు. జూమ్‌లో ఇప్పటికే ఇలాంటి ఫీచర్ ఉండగా, ప్రస్తుతం గూగుల్ మీట్ కూడా ‘రైజ్ హ్యాండ్’ను ఇంట్రడ్యూస్ చేసింది.

యూజర్ నేమ్ దగ్గరే ‘రైజ్ హ్యాండ్’ సింబల్‌తో ఓ ఐకాన్‌ను ఏర్పాటు చేసింది. ప్రశ్నించాలనుకున్నా, సందేహం వచ్చినా, ఏవైనా సజెషన్స్, ఇన్‌పుట్స్ ఇవ్వాలన్నా జస్ట్.. ఆ బటన్ ప్రెస్ చేయడంతోనే మీటింగ్‌లో ఉన్నవాళ్లందరికీ ఆ నోటిఫికేషన్ వెళుతుంది. అంతేకాదు రైజ్ చేసిన హ్యాండ్‌ను దించాలనుకుంటే, మళ్లీ దానిపైనే ట్యాప్ చేస్తే చాలు.

ఈ ఫీచర్ ప్రస్తుతానికి కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. మరో ఒకటిరెండు వారాల్లో అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ రైజ్ హ్యాండ్ ఫీచర్.. వ్యక్తిగత గూగుల్ అకౌంట్లకు, వర్క్‌స్పేస్ బిజినెస్ స్టార్టర్ ప్లాన్లకు, జీసూట్ బేసిక్ వినియోగదారులకు అందుబాటులో లేదు. వర్క్ స్పేస్ ఎసెన్షియల్స్, బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్లస్, ఎంటర్‌ప్రైజ్ ఎసెన్షియల్స్, ఎంటర్‌ప్రైజ్ స్టాండర్డ్, ఎంటర్‌ప్రైజ్ ప్లస్, జీసూట్ బిజినెస్, ఎడ్యుకేషన్, ఎంటర్‌ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్, నాన్ ప్రాఫిట్ ప్లాన్లకు అందుబాటులోకి రానుంది.

Next Story

Most Viewed