గూగుల్ మ్యాప్స్‌లో ఈజీగా లొకేషన్ షేరింగ్

by  |
గూగుల్ మ్యాప్స్‌లో ఈజీగా లొకేషన్ షేరింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ తన యాప్‌లలో ప్రధాన యాప్‌ గూగుల్‌ మ్యాప్. గూగుల్ మ్యాప్స్ ఫిబ్రవరిలో 15 ఏళ్లు మైలురాయిని దాటిన సందర్భంగా.. కొత్త లోగోతోపాటు, ఎక్స్‌ప్లోర్‌, కమ్యూట్‌, సేవ్డ్‌, కంట్రిబ్యూట్‌, అప్‌డేట్స్ అనే ఐదు ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ‘ప్లస్ కోడ్’ను యూజర్లకు అందిస్తోంది.

కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్నా.. మనం అడ్రస్ ఎవరికైనా పిన్ చేయాలన్నా.. గూగుల్ మ్యాప్స్ తప్పనిసరి. అంతేకాదు నావిగేషన్ సర్వీసెస్ అందించడం లో గూగుల్ కు మించిన సర్వీస్ ఇప్పటివరకు ఏది లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే.. ప్రపంచంలో రెండు బిలియన్ల ప్రజల ఇంటి అడ్రస్ లేదా లోకేషన్ షేరింగ్ మాత్రం అంత ఈజీగా లోకేట్ కాలేకపోతున్నాయని గూగుల్ అంటోంది. అందువల్లే ఇక ముందు ఆండ్రాయడ్ యూజర్లు లోకేషన్ డాటాను మరింత ఈజీగా పంపించేందుకు వీలుగా గూగుల్ ‘ప్లస్ కోడ్’ను తీసుకొచ్చింది.

ఎలా చేయాలంటే?

గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయగానే.. మన కరెంట్ లోకేషన్ పై బ్లూ డాట్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయగానే మనకు ఆల్ఫాన్యూమరిక్ లో కోడ్ కనిపిస్తుంది. ఈ కోడ్ ను ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు. గూగుల్, గూగుల్ మ్యాప్స్ లలో సెర్చ్ చేసినా.. అడ్రస్ తెలిసిపోతుంది. ఇది మన రెగ్యులర్ అడ్రస్ ను తెలియజేస్తుంది. స్ట్రీట్ నేమ్, లేదా స్ట్రీట్ నెంబర్ అందులో కనిపిస్తుంది. ఆఫ్ లైన్ లో నూ ప్లస్ కోడ్స్ ఉపయోగించుకోవచ్చని గూగుల్ చెబుతోంది.



Next Story

Most Viewed