కరోనాకు మరో 50 మిలియన్లు ఇస్తున్న గూగుల్

by  |
కరోనాకు మరో 50 మిలియన్లు ఇస్తున్న గూగుల్
X

దిశ, వెబ్‌డెస్క్:
గత రెండు నెలలుగా కొవిడ్ 19 కట్టడిలో తన వంతు శ్రమగా పోర్టల్స్ ద్వారా, కచ్చితమైన సమాచారం ద్వారా మాత్రమే కాకుండా తమ ఛారిటబుల్ ఫండ్ ద్వారా కూడా సాయం చేస్తోంది. ఇప్పటికే 50 మిలియన్ డాలర్లు కరోనా రెస్పాన్స్ కోసం విరాళంగా గూగుల్ దానికి మరో 50 మిలియన్ డాలర్లు జత చేసింది. దీంతో మొత్తం 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చినట్లైంది.

మొదట విరాళంగా ఇచ్చిన 50 మిలియన్ డాలర్లను ఆరోగ్యం, సైన్స్, ఆర్థిక రికవరీ కోసం ఖర్చు పెట్టడానికి కేటాయించింది. ఈ కొత్తగా ఇచ్చిన 50 మిలియన్ డాలర్లతో వాటితో పాటు దూరవిద్య మీద కూడా పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ తన బ్లాగులో పేర్కొంది. అంతేకాకుండా గూగుల్.ఆర్గ్ వారు కొవిడ్ 19 కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాజెక్టులలో 50000 గంటలు పనిచేయనున్నట్లు గూగుల్.ఆర్గ్ ప్రెసిడెంట్ జాక్వెలీన్ ఫుల్లెర్ తెలిపారు. వారి విరాళంలో 5 మిలియన్ డాలర్లను 2000ల మంది మహిళలకు పెట్టుబడిపరంగా, సాంకేతికపరంగా సాయం చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే మరో 5 మిలియన్ డాలర్లను ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రికవరీ ప్రోగ్రామ్ కోసం వెచ్చించనున్నారు. దీని వల్ల యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ దేశాల్లోని 32 దేశాల పేదలకు సాయం దొరకనుంది. ఇవి మాత్రమే కాకుండా మరో 10 మిలియన్ డాలర్లను ఎన్జీవోలకు గూగుల్ తక్షణమే అందిస్తోంది. ఇవన్నీ కాకుండా గూగుల్ సీఈవో సొంతంగా రూ. 5 కోట్లను గివ్ ఇండియా వారికి విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags: corona, covid, google, donation, covid response, more money, sunder pichai, give india, skills, women, NGOs

Next Story