టీఆర్ఎస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆ కమిటీల ఏర్పాటు

by  |
MLC Palla Rajeshwar Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : యాక్టీవ్‌గా ఉన్న కార్యకర్తలను గుర్తించి సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటుతో పాటు రెండు నెలల్లో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నిర్మాణం పూర్తిచేస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా 61లక్షల సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు. త్వరలోనే మరో 9 లక్షలు పూర్తి చేసి 70 లక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 48 లక్షల సభ్యత్వాలకు డిజిటలైజేషన్ పూర్తయిందని, ఈ నెల 20లోగా మిగతా సభ్యత్వాలను పూర్తి చేస్తామని వెల్లడించారు. 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం ప్రారంభమైందని, వీటిల్లో 24 జిల్లాలో పూర్తికాగా, 7 జిల్లాలో 95శాతం పూర్తయ్యాయన్నారు. ప్రతి జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌తో ప్రారంభించి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

సోషల్ మీడియాలో కూడా పార్టీ ఆక్టివ్‌గా ఉంటుందని, దళిత సాధికారత పథకం దళిత వర్గాల్లో ఉత్తేజం నింపిందని అన్నారు. ఏడేళ్లలో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేశామని, మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త జోనల్ వ్యవస్థ ఆమోదంతో త్వరలోనే నిరుద్యోగుల సమస్యలు కూడా తొలగిపోతాయని వెల్లడించారు. 30వేల పంపుసెట్లకు ఉచితంగా 24 గంటల కరెంటును అందజేస్తున్నామని అన్నారు.

కృష్ణా జలాల పై హక్కులు లేని వాళ్లు కోర్టుకు వెళ్తున్నారని, లేని నీటి కోసం ఏపీ అక్రమాలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణకు రావల్సిన వాటా కోసం కోట్లాడుతామని, చుక్కనీరు ఆంధ్రకు పోనివ్వమన్నారు. నీటిపై ప్రజలను కూడా చైతన్యం చేస్తామని వెల్లడించారు. ఏపీ ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కడుతాం.. నీటిని దొంగలిస్తా అంటే చూస్తూ ఉరుకోబోమని హెచ్చిరించారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు.

Follow Dishadaily official Facebook Page : https://www.facebook.com/dishatelugunews



Next Story

Most Viewed