ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

by  |
ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, పటాన్‌చెరు: బీహెచ్ఈఎల్ డిపో నుండి రామచంద్రాపురం, అశోనగర్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి ల మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు, ఒంగోలు తదితర అన్నీ ప్రాంతాలకు ఉదయం 2 గంటల నుండి ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున నడుపబడునని డెల్ డిపో మేనేజర్ ఇ.వి సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కొవిడ్ నిబంధనలకనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేసినందు వల్ల తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్ తదితర అన్ని ప్రాంతాలకు ఉదయం నుండే యథావిధంగా బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. అడ్వాన్స్ రిజర్వేషన్ కావలసినవారు tsrtconline.in.com ద్వారా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు.

అంతరాష్ట్ర బస్సు సర్వీసులు

లాక్‌డౌన్ ఎత్తివేతతో అంతరాష్ట్ర సర్వీసులు నడుపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. రేపట్నుంచి ఏపీకీ బస్సులు నడుపునున్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏపీలోకి తెలంగాణ సర్వీసులు నడిపించనున్నట్లు పేర్కొంది. అలాగే ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కర్ణాటకలోకి తెలంగాణ బస్సు సర్వీసులు నడిపించనున్నట్లు తెలిపింది.

Next Story