పెట్టుబ‌డులకు కేరాఫ్ హైద‌రాబాద్ : కేటీఆర్

by  |
KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : బ్యాంకింగ్, ఆర్థిక సేవ‌ల పెట్టుబ‌డులకు హైద‌రాబాద్ న‌గ‌రం కేంద్రంగా మారి ప‌లు మ‌ల్టీనేష‌న‌ల్ బ్యాంకుల‌ను ఆక‌ర్షించింద‌ని రాష్ర్ట ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాయ‌దుర్గంలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కార్యాల‌యాన్ని సోమ‌వారం ప్రారంభించి మాట్లాడారు. బ్యాంకింగ్, ఆర్థిక‌, బీమా రంగాల్లో హైద‌రాబాద్ న‌గ‌రం వేగంగా వృద్ధి చెందుతోంద‌ని, ప్రతిష్టాత్మక కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టాయన్నారు. ఈ రంగాల్లో ల‌క్షా 80 వేల మంది కేవ‌లం హైద‌రాబాద్‌లో ఉపాధి పొందుతున్నారని, ఈ రంగాల్లో భాగ్యన‌గరానికి ఉన్న అనుకూల‌త‌లే కారణమని పేర్కొన్నారు.

ఐఎస్‌బీ, ఐఐఎం బెంగ‌ళూరు స‌హకారంతో దేశ వ్యాప్తంగా 10 వేల మంది మ‌హిళా పారిశ్రామిక‌వేత్తల‌ను రూపొందించాల‌న్న గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ ల‌క్ష్యాన్ని అభినందిస్తున్నామన్నారు. హైద‌రాబాద్‌లోని వీ-హ‌బ్‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని కోరారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, బ్లాక్ చైన్ సాంకేతిక‌త‌ల్లో రాష్ర్ట ప్రభుత్వం భారీగా పెట్టుబ‌డులు పెడుతోందని, ఆర్థిక రంగంలో మ‌రిన్ని ఆవిష్కర‌ణల రూప‌క‌ల్పన‌కు టీ-హ‌బ్ దోహ‌ద‌ప‌డుతుంద‌నిపేర్కొన్నారు.

Goldman Sachs Company

గోల్డ్‌మ్యాన్ సాచ్స్ కంపెనీ ప్రతినిధి గుంజన్ స‌మతాని మాట్లాడుతూ కంపెనీలో ప్రస్తుతం 250 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, ఈ ఏడాది చివ‌రి నాటికి 800 మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నామన్నారు. 2023 నాటికి 2,500 మందికి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కంపెనీ చైర్మన్ అండ్ సీఈ ఓ సంజయ్ ఛటర్జీ, కౌన్సిలర్ చీప్ క్లర్క్ లెడ్జర్, ఐటీ పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed