వెనక్కి తగ్గుతున్న బంగారం!

by  |
వెనక్కి తగ్గుతున్న బంగారం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా బలహీనపడుతున్న పసిడి బుధవారం మరింత తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం క్షీణించడం, దేశీయంగా జ్యువెలరీ వ్యాపారులు, నాణెల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కేంద్రం కొత్త బడ్జెట్ ప్రకటనలో కస్టమ్స్ సుంకాన్ని తగ్గించనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా బంగారం ధరలు తగ్గుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

బుధవారం సాయంత్రానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 540 తగ్గి రూ. 47,750 ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 43,750కి చేరుకుంది. గడిచిన ఎనిమిది నెలల్లో ఇదే కనిష్ట స్థాయి అని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. వెండి కూడా కిలోకు రూ. 1,400 తగ్గి రూ. 73,600గా ఉంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గమనిస్తే..రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్లో 10 గ్రాముల బంగారం రూ. 50,070 ఉండగా, ముంబైలో రూ. 46,690, చెన్నైలో రూ. 47,940, కోల్‌కతాలో రూ. 48,870, బెంగళూరులో రూ. 47,730గా ఉంది.



Next Story