తగ్గిన బంగారం దిగుమతులు!

by  |
తగ్గిన బంగారం దిగుమతులు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో బంగారానికి ఉండే విలువే వేరు. ఎలాంటి శుభకార్యానికైనా బంగారం కొనాల్సిందే. అందుకోసం దేశీయంగా బంగారం దిగుమతులు అధికంగానే ఉండేవి. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటుపై ప్రభావం కనిపిస్తుoడేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో సుమారు 40 శాతం వరకు బంగారం దిగుమతులు క్షీణించాయని వాణిజ్య మంత్రత్వ శాఖ వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో బంగారం దిగుమతుల విలువ సుమారు రూ. 1.51 లక్షల కోట్లుగా నమోదవ్వగా, ఈ ఏడాదిలో సుమారు రూ. 90 వేల కోట్లకు మాత్రమే పరిమితమైంది.

నవంబర్ నెలలో మాత్రమే సుమారు రూ. 22.07 కోట్ల విలువైన బంగారం దిగుమతి జరిగింది. ఇది గతేడాది నవంబర్‌తో పోలిస్తే 2.65 శాతం ఎక్కువ. బంగారంతో పాటు వెండి దిగుమతులు కూడా తగ్గాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మొత్తం రూ. 5 వేల కోట్ల విలువైన వెండి దిగుమతి అయ్యింది. దీంతో రెండు విలువైన లోహాలు తగ్గడంతో వాణిజ్య లోటు సుమారు రూ. 3.09 లక్షల కోట్లు నమోదైంది, గతేడాది ఇదే సమయంలో వెండి ధర సుమారు రూ. 8.34 లక్షలుగా ఉంది. అత్యధికంగా 800-900 టన్నుల బంగారం దిగుమతి జరిగింది.



Next Story

Most Viewed