శునకానికి నిలువెత్తు బంగారం

by  |
శునకానికి నిలువెత్తు బంగారం
X

తెలంగాణ కుంభమేళా మేడారంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన భక్తులు సమ్మక్క సారక్క అమ్మవార్లకు వినూత్నంగా బంగారాన్ని సమర్పించుకొని భక్తిని చాటుకున్నారు. కొద్దిరోజుల క్రితం గోదావరిఖనిలో ఓ కుటుంబానికి చెందిన పెంపుడు శునకం తప్పిపోయింది. చాలా ఇష్టంగా పెంచుకున్న శునకం ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తీవ్ర ఉద్వేగానికి గురైన దంపతులు సమ్మక్క సారక్కలకు మొక్కు కున్నారు. మా పెంపుడు శునకం ఇంటి నుంచి తప్పిపోయి చాలా రోజులవుతుంది. శునకం ఇంటికి వస్తే వచ్చే మేడారం జాతరకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని దేవతలను వేడుకున్నారు. వనదేవతలను వేడుకున్న రెండురోజుల్లోనే శునకం ఇంటికి తిరిగి రావడంతో చాలా సంతోషించారు. ఇప్పుడు మేడారం జాతర జరుగుతుండగా శునకంతో వచ్చిన దంపతులు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Next Story