- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023

దిశ, వెబ్‌డెస్క్ : పసిడి ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం.. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం నేల చూపులు చూస్తోంది. కరోనా కాలంలో రూ.60 వేల మార్కుకు చేరవైన పుత్తడి.. క్రమం తగ్గుతూ వచ్చింది. మూడు నెలల క్రితం కూడా రూ.50 వేల పైచిలుకు ఉన్న ధర ప్రస్తుతం రూ.43 వేలకు చేరింది. తాజాగా శనివారం సైతం బంగారం ధర భారీగా తగ్గింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 43,000కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 450 తగ్గి రూ.46,900 కి చేరింది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగతున్నాయి. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా ఇవాళ భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర ఏకంగా రూ. 900 తగ్గి రూ.73,400కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.45,150 వద్ద నిలిచాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గుదల కనబరిచింది. ఇక్కడ రూ.430 తగ్గి రూ.49,260లకు చేరుకుంది. ఢిల్లీలో కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటే రూ.300 తగ్గి.. రూ.68,700 లుగా నమోదు అయింది.