ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

by  |
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
X

దిశ, పరకాల: దొరల దాష్టీకానికి ఎదురుతిరిగి తన పంట గింజలు రక్షించడమే కాకుండా, నాటి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచి, తెలంగాణ సాయుధ పోరాటంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చాకలి ఐలమ్మ 106వ జయంతి వేడుకలను పరకాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సారి జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో ఈ ఉత్సవాలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు వివిధ ప్రజా సంఘాలు ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. శాయంపేట మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు మడికొండ శ్రీను మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో చిలువేరు మొగిలి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాల్లో సైతం ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మేరుగు శ్రీశైలం, సమన్వయ కమిటీ సభ్యులు చందుపట్ల రమణా రెడ్డి, దగ్గు విజేందర్ రావు, గౌరవ కౌన్సిలర్లు మడికొండ సంపత్, శనిగరపు రజని నవీన్, బండి రాణి సదానందం, పీఏసీఎస్ చైర్మన్ నాగన్న, లింగమూర్తి, వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, పిట్ట రమేష్, ఏఎంసీ డైరెక్టర్ నక్క చిరంజీవి, కో అప్షన్ సభ్యులు షబ్బీర్, పట్టణ కమిటీ సభ్యులు జాల రవీందర్, బుస్స భద్రయ్య, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, మొలుగూరి శ్రీనివాస్, సుజయ్, శనిగరపు శ్రీను, జేపీ, బియా బాని, అల్తాఫ్, రాజు, అన్ని వార్డుల అధ్యక కార్యదర్శులు, ఏకు రమేష్, బొట్ల నరేష్, బొచ్చు బిక్షపతి, ఏకు రఘుపతి, బొచ్చు శ్రీనివాస్, పోషణపల్లి నాగరాజు, బండి వెంకటేష్, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమను పలువురు గుర్తు చేసుకోవడం జరిగింది.


Next Story